విధాత: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. తుఫాన్ వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రైతులకు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తప్పిదాలపై ప్రశ్నిస్తే తన లాంటి వారిని జైల్లో కూడా పెడతారని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో రెండు దఫాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలపై టిడిపి అధి నేత చంద్రబాబు నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అహంకారంతో ఉందని అహంకారంతో ఏమవుతుందో తెలంగాణ చూశామన్నారు. మరో మూడు నెలలు తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితి అంటూ చంద్రబాబుకు వ్యాఖ్యలు చేశారు.