మూడేళ్ల త‌ర్వాత సొంతూరుకు చంద్రబాబు & ఫ్యామిలీ

నంద‌మూరి కుటుంబంతో క‌లిసి సంక్రాంతి సంబ‌రాలు ముస్తాబ‌వుతున్న నారావారి ఇల్లు విధాత‌: అధికారంలో ఉన్నపుడో… అధికారం కావాలనుకున్నపుడో చంద్రబాబుకు సొంత గ్రామం.. సొంత జనాలు గుర్తుకు వస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత ఊరు నారావారిపల్లి వెళ్లి ఫ్యామిలీతో సంక్రాంతి జరుపుకున్న చంద్రబాబు ఆ తరువాత ఏడాది వెళ్ళలేదు. ఆ తరువాత వరుసగా రెండేళ్లు కోవిడ్ పేరుతో తప్పించుకున్నారు. ఇదిగో.. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఆయన కుటుంబంతో సహా.. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు […]

  • Publish Date - January 11, 2023 / 07:55 AM IST
  • నంద‌మూరి కుటుంబంతో క‌లిసి సంక్రాంతి సంబ‌రాలు
  • ముస్తాబ‌వుతున్న నారావారి ఇల్లు

విధాత‌: అధికారంలో ఉన్నపుడో… అధికారం కావాలనుకున్నపుడో చంద్రబాబుకు సొంత గ్రామం.. సొంత జనాలు గుర్తుకు వస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత ఊరు నారావారిపల్లి వెళ్లి ఫ్యామిలీతో సంక్రాంతి జరుపుకున్న చంద్రబాబు ఆ తరువాత ఏడాది వెళ్ళలేదు. ఆ తరువాత వరుసగా రెండేళ్లు కోవిడ్ పేరుతో తప్పించుకున్నారు. ఇదిగో.. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి సిద్ధం అవుతున్నారు.

ఈ సారి ఆయన కుటుంబంతో సహా.. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు చిత్తూరుకు వెళ్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబాలు సంబరాలు చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ రెండు కుటుంబాలు కూడా ఏటా సంక్రాంతికి నారావారి పల్లెకు వస్తుంటాయి.

అయితే అమరావతి రాజధాని రగడతో ఒకసారి. కరోనా కారణంగా రెండేళ్లు వెరసి మూడేళ్ల పాటు సంక్రాం తి సంబరాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ ఇక్కడ నిర్వహించుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నారా వారి పల్లెలోని చంద్రబాబు ఇంటికి పెయింటింగ్ వేసి ఆవరణలో రంగులతో తీర్చిదిద్దారు.

మూడేళ్ళ గ్యాప్ తరువాత చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి వస్తున్న తరుణంలో చిత్తూరు లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, పులివర్తి నాని.. మండల నాయకులతో కలిసి పనులను పర్యవేక్షించారు. చంద్రబాబు ఇంటికి సున్నాలు, ఇంటి ముందు రంగువల్లులుతో ముస్తాబు చేస్తున్నారు.

ఇదీ షెడ్యూల్

ఈనెల 12వ తేదీన నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి నారా దేవాన్ష్ రానున్నారు.
13న చంద్రబాబునాయుడు, లోకేశ్ రానున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా వస్తారు.
16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, 17న నారా భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు వీడ్కోలు తీసుకుంటారు.