Chandrayaan-3 | 14న చంద్రయాన్‌- 3.. కొత్త తేదీ ప్రకటించిన ఇస్రో

Chandrayaan-3 | చంద్రయాన్‌ - 3 ప్రయోగాన్ని ఈ నెల 14వ తేదీన చేపట్టనున్నట్టు ఇస్రో గురువారం ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు భారత మూన్‌ రాకెట్‌ శ్రీహరి కోట నుంచి బయల్దేరు తుందని వెల్లడించింది. గతంలో చంద్రయాన్‌ 1ను 2008లో విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ అసెంబ్లింగ్‌ పనులు మొత్తం పూర్తయ్యాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. చంద్రయాన్‌ 1 చంద్రుడిపై కాలుమోపే క్రమంలో వరుస ప్రయోగాలను ఇస్రో చంద్రయాన్‌ పేరిట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చంద్రయాన్‌ […]

  • Publish Date - July 6, 2023 / 02:56 PM IST

Chandrayaan-3 |

చంద్రయాన్‌ – 3 ప్రయోగాన్ని ఈ నెల 14వ తేదీన చేపట్టనున్నట్టు ఇస్రో గురువారం ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు భారత మూన్‌ రాకెట్‌ శ్రీహరి కోట నుంచి బయల్దేరు తుందని వెల్లడించింది. గతంలో చంద్రయాన్‌ 1ను 2008లో విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ అసెంబ్లింగ్‌ పనులు మొత్తం పూర్తయ్యాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

చంద్రయాన్‌ 1

చంద్రుడిపై కాలుమోపే క్రమంలో వరుస ప్రయోగాలను ఇస్రో చంద్రయాన్‌ పేరిట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చంద్రయాన్‌ 1ను 2008లో నిర్వహించి, విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దాదాపు రెండేళ్ల మిషన్‌లో స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమించింది.

చంద్రుడిపై ఉన్న రసాయనాలు, ఖనిజాలు గుర్తించడంతోపాటు, చంద్రుడి జియోలాజిక్‌ మ్యాపింగ్‌ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు 3400 భ్రమణాలు చేసింది. 2009 ఆగస్ట్‌ 29న ఇస్రోతో అది సంబంధాలు కోల్పోవడంతో చంద్రయాన్‌ -1 ముగిసింది.

సంక్లిష్టం.. చంద్రయాన్‌ -2

చంద్రయాన్‌ 1 విజయవంతంతో రెట్టించిన ఉత్సాహంతో అత్యంత క్లిష్టమైన చంద్రయాన్‌-2 మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఈ ప్రయోగం.. చంద్రుడిపై స్థలాకృతి, సెస్మోగ్రఫీ, ఖనిజాల గుర్తింపు, అవి చంద్రుడిపై విస్తరించి ఉన్న తీరు, చంద్రుడిపై ఉన్న రసాయనాలు తదితర అంశాలపై విస్తృతస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు ఉద్దేశించారు.

చంద్రయాన్‌ 3లో ఆర్బిటార్‌, లాండర్‌, రోవర్‌ ఉన్నాయి. అయితే.. చంద్రుడిపై లాండ్‌ అయ్యే సమయంలో అది దారి తప్పి.. ఇస్రోతో సంబంధాలు తెగిపోవడంతో ప్రయోగం విఫలమైంది.

చంద్రయాన్‌ – 3

చంద్రయాన్‌ – 2కు కొనసాగింపుగా మూడో మిషన్‌ను చేపట్టారు. సురక్షితంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయి.. రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై తిరిగేలా పకడ్బందీగా రూపొందించారు. తాజాగా రూపొందించిన ల్యాండర్‌.. చంద్రుడిపై సాఫ్ట్‌లాండ్‌ అవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. అనంతరం చంద్రుడిపై అనేక పరిశోధనలు చేయనున్నాయి.