Site icon vidhaatha

Virat kohli | విరాట్ కోహ్లీ రికార్డ్‌ని బ‌ద్ద‌లు కొట్టిన చంద్ర‌యాన్ 3.. మరెవ్వరూ చేరుకోలేని రేర్ ఫీట్ ఇది..!

Virat kohli |

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్క‌ర్ సాధించిన ఘ‌న‌త‌లు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న చేసిన ప‌రుగులు, సాధించిన సెంచ‌రీలు క‌ల‌లో కూడా బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని చాలా మంది భావించారు. కాని ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆ రికార్డ్‌ల‌ని ఒక్కొక్క‌టిగా చెరుపుకుంటూ వ‌స్తున్నాడు.

ఇక కోహ్లీకి సోష‌ల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆయ‌న గ్రౌండ్‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోను రికార్డులు తిర‌గ‌రాస్తుంటాడు. సరిగ్గా 10 నెలల క్రితం అంటే.. 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో భార‌త జ‌ట్టు.. పాక్‌పై అద్వితీయైన విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడి.. అజేయంగా 82 పరుగులు చేసి.. భారత్‌కు చిర‌స్మ‌ర‌ణీమైన విజయాన్ని అందించాడు.

ఇక ఆ త‌ర్వాత కోహ్లీపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డం కోహ్లీ వ‌ల్ల‌నే సాధ్యం అంటూ తెగ పొగిడేశారు. ఈ క్ర‌మంలో కోహ్లీ.. తన అభిమానుల కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేసి, “ప్రత్యేక విజయం. హోరెత్తిన మీ అభిమానానికి ధన్యవాదాలు. ” అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు. కోహ్లీ చేసిన ఈ ట్వీట్‌కి 796K లైక్‌లు వచ్చాయి.

Exit mobile version