విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: గత కొంత కాలంగా చిరుతలు, పెద్దపులులు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటి సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం కలకలం రేపింది. హెటిరో ల్యాబ్స్‌లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యయాయి.
చిరుత సంచారం గురించి పరిశ్రమ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటలకు కంపెనీలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. చిరుతను బంధించేందుకును బోన్ ఏర్పాటు చేశారు.
హెచ్ బ్లాక్ లోని రియాక్టర్ ఛాంబర్ లో దాగి ఉన్న చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. చిరుతను పట్టేందుకు మూడు బోన్లను ఏర్పాటు చేశారు. భారీ శబ్దాలు చేసి చిరుతను కిందకి దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చిరుతను పట్టేందుకు అస్త్రంగా మేకను వదిలారు. ఎట్టి పరిస్థితులలో రెండు మూడు గంటల్లో మత్తుమందు ఇచ్చి బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.