బిడ్డ న‌ల్ల‌గా పుట్టింద‌ని.. భార్యను చంపిన భ‌ర్త‌.. పట్టిచ్చిన కూతురు

విధాత : బిడ్డ న‌లుపు రంగులో పుట్ట‌డంతో.. భార్య‌పై భ‌ర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ బిడ్డ త‌న‌కు పుట్ట‌లేద‌ని భార్య‌పై ఎన్నోసార్లు గొడ‌వ పెట్టుకున్నాడు. అనుమానంతో ఆమెను హ‌త‌మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్‌కు లిపికా మండ‌ల్‌(22)కు ఏడేండ్ల క్రితం వివాహ‌మైంది. పెళ్లి త‌ర్వాత జీవనోపాధి నిమిత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌కు వ‌ల‌సొచ్చారు. రెండున్న‌రేండ్ల క్రితం మాణిక్‌, లిపికా దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది. […]

  • Publish Date - September 25, 2022 / 03:39 AM IST

విధాత : బిడ్డ న‌లుపు రంగులో పుట్ట‌డంతో.. భార్య‌పై భ‌ర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ బిడ్డ త‌న‌కు పుట్ట‌లేద‌ని భార్య‌పై ఎన్నోసార్లు గొడ‌వ పెట్టుకున్నాడు. అనుమానంతో ఆమెను హ‌త‌మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్‌కు లిపికా మండ‌ల్‌(22)కు ఏడేండ్ల క్రితం వివాహ‌మైంది. పెళ్లి త‌ర్వాత జీవనోపాధి నిమిత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌కు వ‌ల‌సొచ్చారు. రెండున్న‌రేండ్ల క్రితం మాణిక్‌, లిపికా దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది.

ఆమెకు మ‌హి అని నామ‌క‌ర‌ణం చేశారు. పాప న‌లుపు రంగులో పుట్ట‌డంతో భార్య‌పై మాణిక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప‌లుమార్లు గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి.

అయితే సెప్టెంబ‌ర్ 18వ తేదీన లిపికాకు మూర్ఛ వ‌చ్చింద‌ని చెప్పి, స్నేహితుల స‌హాయంతో కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి మాణిక్ అంబులెన్స్‌లో తీసుకెళ్లాడు. అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే మెడ‌పై క‌మిలిన‌ట్లు ఉండ‌టంతో వైద్యుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు పోలీసులు. అనంత‌రం లిపికాకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అనంతరం లిపికా కూతురు మ‌హిని, తాత‌య్య కార‌గావ్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ అమ్మ‌కు ఏమైంద‌ని మ‌హిని తాత‌య్య అడగగా పాప పూస‌గూచ్చిన‌ట్లు జ‌రిగిందంతా చెప్పింది. నాన్నే అమ్మ గొంతును రెండు చేతుల‌తో నొక్కిండు.. అమ్మ కాళ్లు, చేతులు కొట్టుకుంది. కాసేప‌య్యాక క‌ద‌ల‌కుండా అలాగే ప‌డుకుంది అని వ‌చ్చిరాని మాట‌ల‌తో పాప మ‌హి చెప్ప‌డంతో తాత‌య్య ఆవేద‌న చెంది త‌క్ష‌ణ‌మే ఒడిశా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఒడిశా పోలీసులు కాకినాడ పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేయ‌డంతో మాణిక్‌ను అరెస్టు చేశారు.