Covid-19 | కొవిడ్ విజృంభ‌ణ‌.. అక్కడ మరో వేవ్ వ‌చ్చే ప్రమాదం!

వారానికి 6.5 కోట్ల కేసులు విధాత‌: చైనాలో కొవిడ్ (Covid-19) మ‌రోసారి జ‌డ‌లు విప్పుతోంది. జూన్ చివ‌రి నాటిక‌ల్లా వారానికి 6.5 కోట్ల కేసులు న‌మోదవుతాయ‌ని అక్క‌డి నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో మ‌రో వేవ్‌ను అడ్డుకోవ‌డానికి చైనా అధికారులు వ్యాక్సినేష‌న్‌ను పెద్ద ఎత్తున చేప‌డుతున్నారు. ఈ కేసుల పెరుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం ఎక్స్‌బీబీ వేరియంట్ అని భావిస్తున్నారు. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే రెండో వేవ్ రావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని జాంగ్ నాన్ష‌న్ అనే వైద్యుడు తెలిపారు. […]

  • Publish Date - May 24, 2023 / 05:40 AM IST

వారానికి 6.5 కోట్ల కేసులు

విధాత‌: చైనాలో కొవిడ్ (Covid-19) మ‌రోసారి జ‌డ‌లు విప్పుతోంది. జూన్ చివ‌రి నాటిక‌ల్లా వారానికి 6.5 కోట్ల కేసులు న‌మోదవుతాయ‌ని అక్క‌డి నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో మ‌రో వేవ్‌ను అడ్డుకోవ‌డానికి చైనా అధికారులు వ్యాక్సినేష‌న్‌ను పెద్ద ఎత్తున చేప‌డుతున్నారు.

ఈ కేసుల పెరుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం ఎక్స్‌బీబీ వేరియంట్ అని భావిస్తున్నారు. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే రెండో వేవ్ రావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని జాంగ్ నాన్ష‌న్ అనే వైద్యుడు తెలిపారు.

చైనా ప్ర‌భుత్వం ఈ నెల మొద‌టి నుంచి కొవిడ్ కేసుల అప్‌డేట్ల‌ను ఇవ్వ‌క‌పోవడంతో వాస్త‌వ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెలియ‌డం లేద‌ని, 140 కోట్లయ‌ చైనా జ‌నాభాలో చాలా మందికి రోగ‌నిరోధ‌క శ‌క్తి లేద‌ని ఆయ‌న తెలిపారు.

తాజాగా కేవ‌లం ఎక్స్‌బీబీ వేరియంట్‌ను ఎదుర్కోవ‌డానికి చైనా ప్ర‌భుత్వం వ్యాక్సిన్‌ల‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్ప‌టికే రెండు టీకాల‌కు అనుమ‌తి ఇవ్వ‌గా మ‌రో నాలుగు టీకాలు కూడా మార్కెట్‌లోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇటీవ‌లే కొవిడ్‌ను ఎమ‌ర్జెన్సీ జాబితా నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే.

Latest News