చైనాకు మ‌రిన్ని క‌ష్టాలు.. నేటి నుంచి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు!

ఊరిబాట ప‌ట్టిన చైనా ప్ర‌జ‌లు క‌రోనా విజృంభిస్తుంద‌ని ఆందోళ‌న‌ గ‌డిచిన నెల‌రోజుల్లో 60వేల మంది క‌రోనాతో చ‌నిపోయార‌ని ప్ర‌క‌ట‌న‌ వేడుక‌ల త‌ర్వాత రోజుకు 36వేల మ‌ర‌ణాలుండొచ్చ‌ని అనుమానం విధాత‌: ఇప్ప‌టికే క‌రోనా కోర‌ల్లో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాకు మ‌రో విప‌త్తు వ‌చ్చిప‌డింది. కొత్త సంవ‌త్స‌రం వేళ జ‌నం ఊళ్ల‌బాట ప‌డితే వైర‌స్ మ‌రెంత‌గా విస్త‌రిస్తుందన్న గుబులు ప‌ట్టుకున్న‌ది. చైనాలో కొత్త సంవ‌త్స‌రం (లూనార్ ఇయ‌ర్‌) జ‌న‌వ‌రి 21నుంచి ప్రారంభ‌మవుతుంది. కొత్త సంవ‌త్స‌రం వేళ చైనాలో జ‌న‌మంతా […]

  • Publish Date - January 20, 2023 / 11:42 AM IST
  • ఊరిబాట ప‌ట్టిన చైనా ప్ర‌జ‌లు
  • క‌రోనా విజృంభిస్తుంద‌ని ఆందోళ‌న‌
  • గ‌డిచిన నెల‌రోజుల్లో 60వేల మంది క‌రోనాతో చ‌నిపోయార‌ని ప్ర‌క‌ట‌న‌
  • వేడుక‌ల త‌ర్వాత రోజుకు 36వేల మ‌ర‌ణాలుండొచ్చ‌ని అనుమానం

విధాత‌: ఇప్ప‌టికే క‌రోనా కోర‌ల్లో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాకు మ‌రో విప‌త్తు వ‌చ్చిప‌డింది. కొత్త సంవ‌త్స‌రం వేళ జ‌నం ఊళ్ల‌బాట ప‌డితే వైర‌స్ మ‌రెంత‌గా విస్త‌రిస్తుందన్న గుబులు ప‌ట్టుకున్న‌ది. చైనాలో కొత్త సంవ‌త్స‌రం (లూనార్ ఇయ‌ర్‌) జ‌న‌వ‌రి 21నుంచి ప్రారంభ‌మవుతుంది. కొత్త సంవ‌త్స‌రం వేళ చైనాలో జ‌న‌మంతా సొంత ఊరు బాట ప‌ట్టి వేడుక‌లు జ‌రుపుకొంటారు. సాధార‌ణంగా.. ఈ వేడుక‌లు జ‌న‌వ‌రి 21నుంచి ఫిబ్ర‌వ‌రి 4 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు.

గ‌త రెండేండ్లుగా క‌రోనా కార‌ణంగా.. జ‌నం న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు దూరంగా ఉన్నారు. సొంతూళ్ల‌కు కూడా పోలేదు. ఈ సారి క‌రోనా ఉన్నా చైనీయులు ఊరి బాట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. దీని కోసం జ‌న‌వ‌రి 7నుంచి ఇప్ప‌టిదాకా చైనా ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి 48 కోట్ల మంది సొంత ఊళ్ల‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో క‌రోనా మ‌రింత‌గా పెరుగుతుంద‌ని ఆందోళ‌ల‌న చెందుతున్నారు.

ఇలా కోట్లాది మంది ఊరి బాట ప‌ట్ట‌డాన్ని మ‌హా వ‌ల‌స (గ్రేట్ మైగ్రేష‌న్‌)గా పిలుస్తున్నారు. చైనాలోని ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి గ్రామీణ ప్రాంతాల‌కు కోట్లాది మంది త‌ర‌లి పోతే.. ఇప్ప‌టిదాకా చైనా ప్ర‌ధాన న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైన క‌రోనా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల‌కు కూడా వ్యాపించే ప్ర‌మాదం ఉన్న‌ది.

ఈ ప‌రిస్థితిలో జ‌నం ఊళ్ల బాట ప‌ట్ట‌డంతో ఎదుర‌య్యే ఉప‌ద్ర‌వాన్ని ఊహించుకొని చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ మొద‌లు స‌ర్వ‌త్రా ఆందోళ‌న చెందుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తేనే జ‌నం తిర‌గ‌బ‌డిన ఉదంతాలున్నాయి. కాబ‌ట్టి ఊళ్ల‌కు ప్ర‌యాణాలు వ‌ద్దంటే జ‌నం వినిపించుకునే ప‌రిస్థితి లేద‌ని చైనా అధికారులు అంటున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌పంచంలో మ‌రే దేశంలో లేని విధంగా… చైనాలో కొవిడ్ వైర‌స్ విజృంభిస్తున్న‌ది. రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో కొవిడ్ బారిన ప‌డుతున్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే.. గ‌త నెల‌రోజుల్లో క‌రోనాతో 60వేల మంది చ‌నిపోయారు.

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల త‌ర్వాత చైనా వ్యాప్తంగా మ‌ర‌ణాల సంఖ్య రోజుకు 36వేల‌కు చేరుకోవ‌చ్చ‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఏదేమైనా.. చైనాలోని కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు మ‌రిన్ని క‌ష్టాలు తెచ్చి పెడుతుంద‌ని అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు.