Chinmayi Sripada |
చిన్మయి శ్రీపాద.. పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులను అలరిస్తుంది. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను సత్తా చాటుతున్నది. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతకు చిన్మయి మంచి ఫ్రెండ్. సమంతకు చాలా సంవత్సరాలు డబ్బింగ్ చెప్పింది.
దాంతో ఇద్దరి మంచి సంబంధాలున్నాయి. చిన్మయితో పాటు నందినీరెడ్డి, ప్రీతమ్, శిల్పారెడ్డి, మంజుల సైతం సమంతకు స్నేహితులు. అయితే, నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత వీరిపైనే విమర్శలు వచ్చాయి. సమంత విడాకులు తీసుకునేలా ప్రభావితం చేశారని విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా చిన్మయితో పాటు ప్రీతమ్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. చిన్మయి భయంకరమైన ఫెమినిస్ట్ అని, ఆమె కారణంగానే సమంత ఇలా తయారైందని, అందుకే కాపురం సర్వనాశనమైందంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ సమంత విషయంలో చిన్మయిపై నెటిజన్లు మండిపడుతూనే ఉన్నారు.
సమంత, చైతు విడాకులకు నువ్వే కారణం.. సమంత జీవితం నాశనమైంది. కానీ, నువ్వు మాత్రం నీ భర్తను కుక్కలా ఆడిస్తూ హాయిగా ఉంటున్నావంటూ నెటిజన్లు ఆరోపించారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసే అబ్బాయిలు చాలా డేంజర్ అని, అమ్మాయిలు దయచేసి ఇలాంటి ఎదవల్ని పెళ్లి చేసుకోకండి.. ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండాలంటూ కామెంట్ చేసింది.
మరోసారి సోషల్ మీడియాలో చిన్మయి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల దలైలామా వీడియోపై సైతం విమర్శించింది. చిన్న పిల్లాడితో అలా చేయించడం తప్పని చిన్మయి పేర్కొనగా.. దానిపై విమర్శలు గుప్పించారు.
ముందు మన సమస్యలపై మాట్లాడారు.. వేరే దేశం గురించి నీకెందుకు అంటూ మండిపడ్డారు. అయినా, చిన్మయి వెనక్కి తగ్గకుండా ఏ దేశమైనా.. పిల్లలతో అలా చేయించడం తప్పని.. సదరు పిల్లాడు మన భారతీయుడని, ముందు ఆ విషయం తెలుసుకో అంటూ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.