Keerthi Suresh | కీర్తి సురేష్‌: చిరంజీవి, అమ్మ ఫ్రెండ్స్‌.. ఇంటి నుంచి భోజనం అడిగి మరీ తెప్పించుకునే దాన్ని

Keerthi Suresh | ‘భోళా శంకర్’ అవకాశం రాగానే ముందు భయపడ్డా విధాత: ఎన్ని సినిమాలు చేసినా.. కీర్తిసురేష్ పేరు ముందు మాత్రం ఎప్పటికీ మహానటి స్థిరంగా ఉండిపోతుంది. ఆ సినిమాలో నటించిన నటనతో కీర్తి అలాంటి పేరును సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు అవకాశాలు అరకొరగా ఉన్నప్పటికీ.. తమిళంలో సూపర్‌స్టార్, తెలుగులో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటించే అవకాశాన్ని కీర్తి సొంతం చేసుకుంది. ఈ విషయంలో నిజంగా కీర్తిసురేష్ అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ సరసన ‘అణ్ణాత్తే’ (తెలుగులో […]

  • Publish Date - August 6, 2023 / 07:42 AM IST

Keerthi Suresh |

‘భోళా శంకర్’ అవకాశం రాగానే ముందు భయపడ్డా

విధాత: ఎన్ని సినిమాలు చేసినా.. కీర్తిసురేష్ పేరు ముందు మాత్రం ఎప్పటికీ మహానటి స్థిరంగా ఉండిపోతుంది. ఆ సినిమాలో నటించిన నటనతో కీర్తి అలాంటి పేరును సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు అవకాశాలు అరకొరగా ఉన్నప్పటికీ.. తమిళంలో సూపర్‌స్టార్, తెలుగులో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటించే అవకాశాన్ని కీర్తి సొంతం చేసుకుంది. ఈ విషయంలో నిజంగా కీర్తిసురేష్ అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు.

రజనీకాంత్ సరసన ‘అణ్ణాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంలో చెల్లెలిగా నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో చెల్లెలిగా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. తాజాగా కీర్తి మీడియా ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి ఆమె చెప్పిన విశేషాలివే..

‘‘సూపర్‌స్టార్, మెగాస్టార్‌లకు చెల్లెలిగా నటించినందుకు చాలా సంతోషంగా వుంది. ‘పెద్దన్న’ సినిమా పూర్తిచేసిన తర్వాత ఈ ‘భోళా శంకర్’ ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. సౌత్‌లోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌తో నటించాను.

ఇంతకంటే ఏం కావాలి. చాలా చాలా హ్యాపీగా వుంది. మరో గొప్ప విశేషం ఏమిటంటే చిరంజీవి‌గారితో ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చేశా. మెగాస్టార్‌తో ఒక్క ఫ్రేమ్‌లోనైనా డ్యాన్స్ చేయాలనే కోరిక ఉండేది. కానీ భోళాలో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది.

అసలు ముందు ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఇందులో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అన్నయ్యతో చాలా బబ్లీ, జాలీగా వుండే పాత్ర కాబట్టి.. సూపర్ గా కుదిరింది. సినిమా చూశాక మా రిలేషన్ చూసి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇది ప్రధానంగా బ్రదర్ సిస్టర్ స్టోరీ. బ్రదర్ సిస్టర్ ఎమోషన్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పక్కా ప్యాకేజ్‌లా మెహర్ రమేష్‌గారు ఈ సినిమాని రూపొందించారు.

నాకు రియల్ లైఫ్‌లో బ్రదర్ లేడు.. సిస్టర్ వుంది. కానీ బ్రదర్ లాంటి స్నేహితులు చాలా మంది వున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌తో నాకు మంచి ఫ్రెండ్షిఫ్ కుదిరింది. మా అమ్మ గారు 80s గ్రూప్‌లో చిరంజీవి‌ గారి ఫ్రెండ్. ఇప్పుడు నేనే కొత్త ఫ్రెండ్ (నవ్వుతూ). చిరంజీవి గారితో అమ్మ ‘పున్నమినాగు’ చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది.

చిరంజీవి‌ గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్‌లో ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్‌గా చూసుకునే వారని చెప్పింది. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు.. ఆయన రియాక్షన్ నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.

‘మీ అమ్మగారు ఇంతే చెప్పిందా.. నేను తనతో ఇంకా చాలా చెప్పాను’ అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తు పెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు.. స్ట్రీట్ స్మార్ట్ నువ్వు’ అని అన్నారు.

అమ్మకే కాదు నాకు కూడా సెట్స్‌లో చాలా విలువైన సూచనలు ఇచ్చారు. ఇలా చేస్తే బావుంటుందని చెప్పే వారు. రోజూ చిరంజీవి గారి ఇంటి నుంచి భోజనం వచ్చేసేది. నాకు ఫలానాది కావాలని అడిగి మరీ తెప్పించుకునే దాన్ని.

ఫుడ్ అనేది మా మధ్య మెయిన్ టాపిక్ అయిపోయింది. ఉలవచారు, కాకరకాయ తెగ నచ్చాయి. ప్రతి రోజు ఇంటి నుంచి ఏం వస్తుందో మెనూ చెప్పేవారు. ‘భోళా’ నాకు బ్యూటీఫుల్ జర్నీ. ఆగస్ట్ 11 కోసం వెయిటింగ్. సినిమా అద్భుతంగా వచ్చింది..’’ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.