Chiranjeevi | ఆ న‌టుడు దూల‌గాడు.. అమ్మాయిల‌ని అదోర‌కంగా చూస్తాడ‌న్న చిరంజీవి

Chiranjeevi | రీఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో దుమ్ములేపుతున్నాడు. చివ‌రిగా వాల్తేరు వీర‌య్య సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన చిరు ఇప్పుడు భోళా శంక‌ర్ అనే సినిమాతో మ‌రి కొద్ది గంట‌ల‌లో ప‌ల‌క‌రించ‌నున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఇందులో త‌మ‌న్నా, కీర్తి సురేష్, శ్రీముఖి, వైవా హ‌ర్ష ప‌లువురు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో మెరిసాడు. తమిళంలో మంచి హిట్ కొట్టిన వేదాళం […]

  • Publish Date - August 10, 2023 / 12:45 PM IST

Chiranjeevi |

రీఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో దుమ్ములేపుతున్నాడు. చివ‌రిగా వాల్తేరు వీర‌య్య సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన చిరు ఇప్పుడు భోళా శంక‌ర్ అనే సినిమాతో మ‌రి కొద్ది గంట‌ల‌లో ప‌ల‌క‌రించ‌నున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఇందులో త‌మ‌న్నా, కీర్తి సురేష్, శ్రీముఖి, వైవా హ‌ర్ష ప‌లువురు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో మెరిసాడు.

తమిళంలో మంచి హిట్ కొట్టిన వేదాళం చిత్రంకి రీమేక్‌గా, భోళా శంక‌ర్ చిత్రాన్ని రీమేక్ చేశారు. చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. గ‌త కొద్ది రోజులుగా మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ ఉంటూ సినిమాపై అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్నం చేస్తుంది.

రీసెంట్‌గా చిరంజీవి త‌న చిత్ర బృందంతో క‌లిసి ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌క నిర్మాత‌లతో పాటు కీర్తి సురేశ్, సుశాంత్, రాజా రవీంద్ర, యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు. యాంక‌ర్ శ్రీముఖి సినిమాలో న‌టించిన వారి గురించి ఒక్కో ప్ర‌శ్న వేసింది.

ఈ క్ర‌మంలోనే రాజా రవీంద్ర గురించి చెప్పాలని కోరగా, పెద్ద నోటిదూల గాడు. మనసులో ఏం ఉండదు. బయటకు మాత్రం ఏదో ఒకటి వాగి, దొబ్బులు తింటూ ఉంటాడు.. నన్ను చూస్తే చూశావయ్యా, ఆడపిల్లలను చూడకు. అంటే దరిద్రంగా అలాగే చూస్తాడు రాజా ర‌వీంద్ర గురించి చాలా ఫ‌న్నీగా చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఇక చిరుతో ఆయ‌న జ‌ర్నీ గురించి చెప్పిన రాజా ర‌వీంద్ర త‌మ‌ది చాలా లాంగ్ జ‌ర్నీ అని అన్నారు

అన్న‌య్య‌తో ఏ సినిమా చేసిన కూడా ఫస్ట్ డేలా ఉంటుంది. చాలాసార్లు తిట్లు కూడా తిన్న. నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నానా? అని అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. అప్పుడు ఏంట్రా అలా చూస్తున్నావ్? చేతబడి చేసే వాడిలా ఆ చూపేంటి దరిద్రంగా. పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటారు అని రాజా రవీంద్ర చాలా ఫ‌న్నీ కామెంట్స్ చేశారు. ఇక భోళా శంక‌ర్ సినిమాపై మాత్రం ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉండ‌గా, ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంద‌నేది చూడాల్సి ఉంది.