ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి అందరూ ఆహ్వానితులే: రేవంత్‌ రెడ్డి

ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రమాణా స్వీకారానికి రాష్ట్ర ప్రజలంతా ఆహ్వానితులేనని సీఎల్పీ నేత‌ రేవంత్ రెడ్డి బహిరంగ ఆహ్వాన లేఖ రాశారు.

  • Publish Date - December 6, 2023 / 12:11 PM IST

విధాత: ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రమాణా స్వీకారానికి రాష్ట్ర ప్రజలంతా ఆహ్వానితులేనని సీఎల్పీ నేత‌ రేవంత్ రెడ్డి బహిరంగ ఆహ్వాన లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతూ విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కోన్నారు. 

 

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు… బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న, మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం అని, ఇట్లు మీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు అని లేఖలో పేర్కోన్నారు. అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 300మంది అమర వీరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పలికారు.