Site icon vidhaatha

CM Jagan | ఏపీ శాంతి భద్రతలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan |

విధాత : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు అరెస్టు, అనంతర పరిణామాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌. జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ఉన్నతాధికారులతో శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు.

డీఐజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గత పది రోజులుగా రాష్ట్రంలోని పరిణామాలను జగన్‌కు వివరించారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కూడా జగన్‌ను కలిసి చంద్రబాబు అరెస్టు, పరిణామాలను వివరించారు. టీడీపీ బంద్‌, ఆందోళనల అంశాలపై పోలీసు అధికారులు జగన్‌కు వివరించారు.

భవిష్యత్తులో శాంతిభత్రల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు వైవి.సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పాల్గొన్నారు

Exit mobile version