వేముల మంజులమ్మ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్‌

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియలు స్వగ్రామం బాల్కోండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు

విధాత: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియలు స్వగ్రామం బాల్కోండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. మంజులమ్మ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ హాజరై నివాళులర్పించారు. ప్రశాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌ మంజులమ్మ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.


 


ప్రశాంతరెడ్డిని పరామర్శించి సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. మంజులమ్మ అంత్యక్రియలకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంధ్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ , ఎమ్మెల్సీ కవిత, సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, బీజేపీ ఎంపీ అర్వింద్‌, ఇతర పార్టీల నాయకులు హాజరై నివాళులర్పించారు.