Site icon vidhaatha

CM Revanth Reddy: సమాచార కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!

CM Revanth Reddy:  రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా నియామితులైన పీవీ శ్రీనివాస్ రావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, మొహసిన్ పర్వీన్, దేశాల భూపాల్ లు బుధవారం పదవీ ప్రమాణం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై పదవీ ప్రమాణం స్వీకారం చేసిన నూతన కమిషనర్లను అభినందించారు.

చీఫ్ కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. వారంతా మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆ పదవిలో ఉండనున్నారు. సమాచార కమిషనర్ల పదవి ప్రమాణ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

 

Exit mobile version