మల్టీ టాలెంటెడ్ నటుడు అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘సీతా పయనం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, నిరంజన్ హీరోగా నటిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ధ్రువ సర్జా స్పెషల్ కామియో కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. బహుభాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. యాక్షన్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ స్టంట్స్ డిజైన్ చేశారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను తెచ్చుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనుండగా, పాజిటివ్ టాక్ మధ్య ‘సీతా పయనం’ ఫిబ్రవరి 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
Ola Uber Rapido Strike : రేపు దేశ వ్యాప్తంగా ర్యాపిడో, ఉబర్ సహా యాప్ రవాణా డ్రైవర్ల సమ్మె
Rs 49 Cr In Abu Dhabi Big Ticket : కుమార్తె రూపంలో వరించిన అదృష్టం.. లాటరీలో రూ.49 కోట్లు గెలుచుకున్న కర్ణాటక యువకుడు
