ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ హైకమాండ్‌ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది

  • Publish Date - December 8, 2023 / 11:24 AM IST

విధాత : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ హైకమాండ్‌ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో ఆరు ఖాళీలను ఎవ్వరితో భర్తీ చేయాలన్నదానిపై కూడా సీఎం హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం.


మరోవైపు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం, అనంతరం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.


ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సభ ముందు వివరాలు పెట్టాలని భావిస్తుంది. అయితే ఇంత తక్కువ వ్యవధిలో అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించడం సాధ్యమైతేనే ప్రభుత్వం ఈ విషయంలో ముందుళ్లనుందని సమాచారం.