ఆడుదాం ఆంధ్రాలో ఏపీ సీఎం జగన్‌ సందడి

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌ సందడి చేశారు. గుంటూరు నల్లపాడు లయోలా కళాశాల ప్రాంగణంలో జగన్‌ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు

  • Publish Date - December 26, 2023 / 11:41 AM IST

విధాత : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌ సందడి చేశారు. గుంటూరు నల్లపాడు లయోలా కళాశాల ప్రాంగణంలో జగన్‌ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా స్వయంగా సీఎం జగన్‌ క్రికెట్‌ ఆడి బ్యాట్‌ చేతబట్టి బ్యాటింగ్‌ చేశారు. ఆయనకు స్పోర్ట్స్‌ అథార్టీ(శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి బౌలింగ్‌ వేశారు.


అంతకుముందు మంత్రి ఆర్‌కే. రోజాకు సీఎం జగన్‌ బ్యాటింగ్‌ ఎలా చేయాలో చూపిస్తు ఆమె చేత బ్యాట్‌ పట్టించి మరి నెర్పించారు. అనంతరం బ్యాడ్మింటన్‌, వాలిబాల్‌, ఖోఖో, కబడ్డీ కూడా ఆడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. పలువురికి స్పోర్ట్స్‌ కిట్‌లు అందించారు.