Site icon vidhaatha

15నుంచి 30వరకు లండన్‌కు ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌

విధాత : వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా ఈ నెల 15 నుంచి 30 వరకు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక..ఎన్నికల ప్రచారంలో కొన్ని నెలలుగా బిజీగా గడిపిన జగన్ ఈనెల 13న పోలింగ్ ముగిశాక రాజకీయ, దైనందిన కార్యకలాపాలకు విరామం తీసుకునే నేపథ్యంలో లండన్ పర్యటనకు వెలుతున్నట్లుగా వైసీపీ వర్గాల కథనం.

కాగా.. జగన్ తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే జన్ 4వ తేదీకి ముందే రాష్ట్రానికి చేరుకుంటారు. అయితే జగన్ చెల్లెలు..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌. షర్మిల మాత్రం ఎన్నికల్లో ఓడిపోతాడని తెలుసుకునే జగన్ విదేశాలకు వెలుతున్నాడని ఆరోపించడం ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది.

మరోవైపు సీఎం జగన్‌ ఈనెల 17 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ బుధవారం సీబీఐ కోర్టు అనుమతి కోరారు. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ బెయిల్‌ షరతు సడలించాలని కోర్టును కోరారు. పలు కేసుల్లో ఉన్న జగన్‌ దేశం విడిచి వెళ్ల వద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్‌ వేయాలని కోర్టు ఆదేశిస్తూ విచారణ రేపటి గురువారంకు వాయిదా వేసింది.

Exit mobile version