విధాత: కొలంబియా విమాన ప్రమాదం (Colombia Plane Crash) లో 40 రోజుల తర్వాత నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడిన ఘటనలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. సైన్యం ఆదివారం రక్షించిన 13, 9, 4, 1 ఏళ్ల చిన్నారులు కనీసం మరో రెండు వారాల పాటు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో కొంత మంది నడుస్తున్నారని, మాట్లాడుతున్నారని చిన్నారులను కలుసుకున్న బంధువులు తెలిపారు.
చిన్నారుల్లో ఇద్దరి పిల్లల తండ్రి అయిన మాన్యుల్ రానోఖీ మాట్లాడుతూ.. మే 1న ప్రమాదం జరిగిన తర్వాత వారి తల్లి నాలుగు రోజుల పాటు ప్రాణాలతో ఉందని 13 ఏళ్ల లెస్లీ జాకోబాంబెయిర్ చెప్పినట్లు వెల్లడించారు. ఆమె చనిపోయే ముందు పిల్లలందరినీ ఘటనా స్థలానికి దూరంగా పారిపొమ్మని చెప్పినట్లు ఆయన తెలిపారు.
చిన్నారుల అంకుల్ ఫిడెన్షియో వాలెన్షియా మీడియాతో మాట్లాడుతూ.. ఆ నలుగురు పిల్లలు అడవి (Forest)లో ఉన్నంత కాలం చెట్ల తొర్రల్లో తలదాచుకున్నారని, పాములు, జంతువులు, దోమల నుంచి తప్పించుకోడానికి వారు ఈ పని చేశారని తెలిపారు.
ప్రస్తుతం వారు చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటున్నారని, తొలి రెండు రోజులు వారికి ద్రవాహారమే ఇచ్చినట్లు రక్షణ శాఖ మంత్రి సోమవారం వెల్లడించారు. నలుగురిలో ఒక చిన్నారి తాను త్వరగా నడవాలనుకుంటున్నట్లు చెప్పాడని వారి బంధువు మరొకరు చెప్పారు. మీరు ఒక్కసారి ఆస్పత్రి నుంచి బయటకు వస్తే.. ఫుట్‌బాల్ ఆడదామని వారికి హామీ ఇచ్చానన్నారు.
“Esta es la historia de un Estado donde los niños y las niñas deben ser el corazón de todos” dijo la directora del @ICBFColombia, @AAstrideliana, sobre la noticia de la aparición de los 4 menores que aparecieron luego de 40 días en la selva.
Conoce aquí su emotivo mensaje. ⬇️ pic.twitter.com/THWaGVO14F
— Presidencia Colombia