విధాత : హైదరాబాద్ మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ ను వారించకుండా అతనిని ఎంకరేజ్ చేసిన పూర్ణిమ రావు తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు .ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతామని ప్రకటించారు.