Bandi Sanjay| డబ్బులిచ్చే వారినే హెచ్ సీఏ జట్టులోకి ఎంపిక : బండి సంజయ్

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్ లపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పిస్తలేరని క్రికెటర్ల తల్లిదండ్రులు నాకు ఫిర్యాదు చేశారని, సెలక్షన్ కమిటీ లో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ : హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్(Selection)లపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పిస్తలేరని క్రికెటర్ల తల్లిదండ్రులు నాకు ఫిర్యాదు చేశారని, సెలక్షన్ కమిటీ లో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ కు సమాచారం ఇచ్చామని తెలిపారు, హైదరాబాదులో ఉన్న నైపుణ్యంలేని క్రికెటర్లకి అవకాశం కల్పిస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యులు వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమకు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని…హెచ్ సీఏ సెలక్షన్ కమిటీ అక్రమాలపై బీసీసీఐకి కూడా త్వరలో ఫిర్యాదు చేయబోతున్నామన్నారు.

సెలక్షన్ కమిటీలో ఒక్కో ఆటగాడి నుంచి లక్షల రూపాయలు దండుకున్నట్టు తెలుస్తుందని, నైపుణ్యం ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం జరిగిందని వాపోతున్నారన్నారు. గతంలో మంచి పర్ఫామెన్స్ ఉన్న క్రికెటర్ ను కూడా సెలెక్ట్ చేయలేదని నా దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై నిజ నిజాలు త్వరలోనే బయట పెడతాం అని బండి సంజయ్ తెలిపారు.