Site icon vidhaatha

Trains | బల్లార్షా సెక్షన్‌లో రెండు రైళ్ల రాకపోకల కుదింపు

Trains | విధాత, హైదరాబాద్ : కాజీపేట రైల్వే జంక్షన్‌ బల్లార్షా సెక్షన్‌లో జరుగుతున్న మూడోలైన్‌ ఇంటర్‌ లాకింగ్‌, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా మంగళవారం నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు రైళ్లను బెల్లంపల్లి వరకు కుదిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సెక్షన్‌లోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ రెండు ముఖ్య రైల్వేస్టేషన్లలో మూడోలైన్‌ పనులు జరుగుతున్నందున ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు హైదరాబాద్‌ సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్‌-బల్లార్షా మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలను బెల్లంపల్లి వరకు కుదించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

బెల్లంపల్లి-బల్లార్షా సెక్షన్‌ మూడో లైన్‌ పూర్తయ్యే దశలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటుగా ఇంతకు ముందు రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్‌ ప్యాసింజర్‌, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్‌ 2వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version