విధాత : కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 45మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా..తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. పాడి పశుసంవర్ధక విభాగంలో చేసిన సేవలకుగాను ఈ అవార్డును ప్రకటించారు. ఇక జన్యు సంబంధ పరిశోధనలకుగానూ డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ వచ్చింది. ఆయన హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీలో పని చేస్తున్నారు.
పద్మశ్రీ అవార్డు పొందిన మిగతా 43 మందిలో అంకే గౌడ, ఆర్మిడా ఫెర్నాండెజ్, భగవాన్‌దాస్ రాక్వార్, భిక్ల్యా లడాక్యా ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుధ్రి తాటి, చరణ్ హెంబ్రామ్, చిరంజీ లాల్ యాదవ్, ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యా, గఫ్రుద్దీన్ మేవాటి జోగి, హ్యాలీ వార్, ఇందర్‌జీత్ సింగ్ సిధు, కే పాజనివేల్, కైలాష్ చంద్ర పంత్, ఖేం రాజ్ సుంద్రియాల్, కొల్లక్కాయిల్ దేవకి అమ్మ జి, మహేంద్ర కుమార్ మిశ్రా, మిర్ హాజిభాయ్ కాసంబాయ్, మోహన్ నగర్, నరేష్ చంద్ర దేవ్ వర్మ, నీలేష్ వినోద్‌చంద్ర మండలేవాలా ఉన్నారు.
అాలాగే నూరుద్దీన్ అహ్మద్, ఓతువార్ తిరుత్తణి స్వామినాథన్, పద్మా గుర్మెట్, పొఖిలా లేఖ్తేపి, పున్నియమూర్తి నటేశన్, ఆర్ కృష్ణన్, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారాం ఖేడ్కర్, రాజస్థపతి కలియప్ప గౌండర్, రాంచంద్ర గోద్‌బోలే అండ్ సునీతా గోద్‌బోలే, ఎస్జీ సుశీలమ్మ, సంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్, షఫీ షౌక్, శ్రీరంగ్ దేవాబా లాడ్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పాత్రో, సురేష్ హనగవాడి, తగా రామ్ భీల్, టేచి గుబిన్, తిరువారూరు భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జత్రా సింగ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Yadagirigutta : యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
Anaconda Movie Making Video : అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!
