తెలంగాణలో కాంగ్రెస్‌..రాజస్థాన్‌లో బీజేపీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌లలో కమలం పార్టీ బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు అవసరమైన మెజార్టీ సీట్లలో గెలుపు దిశగా దూసుకెలుతుంది

  • Publish Date - December 3, 2023 / 06:29 AM IST
  • మధ్యప్రదేశ్‌, చత్తీస్ ఘడ్‌లలోనూ కమల వికాసమే
  • తలకిందులైన ఎగ్జిట్ పోల్స్


విధాత: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌లలో కమలం పార్టీ బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు అవసరమైన మెజార్టీ సీట్లలో గెలుపు దిశగా దూసుకెలుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా రాజస్థాన్‌లో ఓటర్లు ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీగా అధికార కాంగ్రెస్‌ను దించేసి, బీజేపీని స్పష్టమైన ఆధిక్యతను అందించారు. తెలంగాణలో మాత్రం అంచనాల మేరకు కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా సాగుతుంది.


ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌లో 230స్థానాలకుగాను బీజేపీ 150స్థానాల్లో, కాంగ్రెస్ 70స్థానాల్లో, ఇతరులు 30స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. చత్తీస్‌ఘడ్‌లో 90సీట్లకుగాను మాత్రం బీజేపీ 45, కాంగ్రెస్ 44, ఇతరులు 1స్థానాలో ఆధిక్యతలో ఉన్నారు. రాజస్ధాన్‌లో 199సీట్లకుగాను బీజేపీ 114, కాంగ్రెస్ 65, ఇతరులు 20స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. తెలంగాణలో 119సీట్లకుగాను కాంగ్రెస్ 65, బీఆరెస్ 40, బీజేపీ 8, ఎంఐఎం 5, బీఎస్పీ, సీపీఐ ఓక్కో స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.