Site icon vidhaatha

మోత్కుపల్లికి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

విధాత, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మోత్కుపల్లిని బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, మూడు రిజర్వ్ ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదంటూ మొన్ననే తన నివాసంలో మోత్కుపల్లి దీక్ష చేశారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వలేదని, మాదిగలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ కండువాను ఉతికి ఆరెస్తానని చెప్పిన మోత్కుపల్లి ఆసుపత్రి పాలవ్వడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది.

Exit mobile version