విధాత : టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందడం చర్చనీయాంశమైంది. తీవ్ర టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి జిల్లాలోని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. జ్వరం అధికంగా ఉండటంతో నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
ప్రభుత్వ వైద్యంపైన, ఆసుపత్రులపై నమ్మకం లేని రోజుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వాసుపత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందడం ఆదర్శనీయమని సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పేద కుటుంబానికి చేందిన వెడ్మ బొజ్జు చిన్నతనంలో పేపర్ బాయ్‌గా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్ భూక్యాపై బొజ్జు సంచలన విజయం సాధించారు.