క‌రోనా కొత్త వేరియంట్లు.. నిపుణుల ఆందోళ‌న‌

ఉత్ప‌రివ‌ర్త‌నాల‌తో ఏ వేరియంట్ ఏ రూపంలో క‌బ‌లిస్తుందో.. విధాత‌: చైనాలో విజృంభిస్తున్న‌ క‌రోనా వైర‌స్‌తో స‌రికొత్త ప్ర‌మాదం పొంచి ఉన్న‌ద‌ని వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ల‌క్ష‌లాది మందిలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైర‌స్ కొత్త‌గా సోకుతున్న ప్ర‌తి వ్య‌క్తిని ఓ వేదిక‌గా చేసుకొని ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది కొత్త వేరియంట్‌గా ఉనికిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని నిపుణులు భ‌య‌ప‌డుతున్నారు. 140 కోట్ల‌కు పైగా ఉన్న చైనాలో ఇప్ప‌టికే పావు వంతు మందికి క‌రోనా వైర‌స్ […]

  • Publish Date - December 26, 2022 / 02:55 PM IST
  • ఉత్ప‌రివ‌ర్త‌నాల‌తో ఏ వేరియంట్ ఏ రూపంలో క‌బ‌లిస్తుందో..

విధాత‌: చైనాలో విజృంభిస్తున్న‌ క‌రోనా వైర‌స్‌తో స‌రికొత్త ప్ర‌మాదం పొంచి ఉన్న‌ద‌ని వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ల‌క్ష‌లాది మందిలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైర‌స్ కొత్త‌గా సోకుతున్న ప్ర‌తి వ్య‌క్తిని ఓ వేదిక‌గా చేసుకొని ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది కొత్త వేరియంట్‌గా ఉనికిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని నిపుణులు భ‌య‌ప‌డుతున్నారు.

140 కోట్ల‌కు పైగా ఉన్న చైనాలో ఇప్ప‌టికే పావు వంతు మందికి క‌రోనా వైర‌స్ సోకింది. చైనాలో ఈ స్థాయిలో వైర‌స్ వ్యాపించ‌టానికి చైనాలో వినియోగించిన వ్యాక్సిన్ ప‌శ్చిమ దేశాల్లో వినియోగించిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంత శ‌క్తివంత‌మైన‌ది కాదు.

అలాగే చైనాలో ఈ వ్యాక్సిన్ వేసుకొని ఏడాది దాటిపోయింది. కాబ‌ట్టి వైర‌స్ విజృంభిస్తున్న‌ద‌ని నిపుణులు అంటున్నారు. ఇది మ‌రికొన్ని రోజుల్లో వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి మొద‌టి వారం వ‌ర‌కు ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందోన‌ని ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతున్న‌ది. అలాగే.. ఏ ఏ దేశాల‌కు ఏ వేరియంట్ రూపంలో వ్యాపిస్తుందోన‌ని భ‌య‌ ప‌డుతున్నారు.

కొత్త‌గా ఇప్పుడు చైనాలో వేగంగా వ్యాపిస్తున్న బీఎఫ్‌7 ర‌కం వైర‌స్ గ‌తంలో సెకండ్ వేవ్ లో వ‌చ్చిన డెల్టా అంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కాద‌ని అంటున్నారు. అయినా చైనాలో పెద్ద ఎత్తున మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి స‌మాచారం మీడియాకు అందుబాటులో లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌మాదం త‌క్కువేమీ లేద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

క‌రోనా వైర‌స్ ఉత్ప‌రివ‌ర్త‌నాల‌తో కొత్త ర‌కం ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు పుట్టుకొచ్చే ప్ర‌మాద‌మున్న‌ద‌ని జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్న వేళ‌.. వైర‌స్‌ ఏ ప్ర‌మాద‌క‌ర రూపం తీసుకొని దాడి చేస్తుందోన‌నేదే ఇప్పుడు అంద‌రినీ వేధిస్తున్న‌ది.