">

Warangal: దేశంలో ప్రథమ అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ బమ్మెరలో ప్రారంభం – vidhaatha " /> " />

Warangal: దేశంలో ప్రథమ అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ బమ్మెరలో ప్రారంభం

రైతులకు ఉచిత న్యాయ సేవలు ప్రారంభించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణ్యన్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) కలిసి జనగాం జిల్లా, పాలకుర్తి మండలం, బమ్మెర గ్రామంలో శనివారం "అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్" ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ వర్చువల్ మోడ్ లో ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. తెలంగాణ […]

  • Publish Date - March 18, 2023 / 02:53 PM IST

  • రైతులకు ఉచిత న్యాయ సేవలు
  • ప్రారంభించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణ్యన్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) కలిసి జనగాం జిల్లా, పాలకుర్తి మండలం, బమ్మెర గ్రామంలో శనివారం “అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్” ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ వర్చువల్ మోడ్ లో ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎక్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్ రావు ఈ క్లినిక్ ప్రాధాన్యతను వివరించారు.

దేశంలో తొలి సారి

రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యల పై ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడం కోసం ఈ క్లినిక్ పనిచేస్తుంది. ఇలాంటి క్లినిక్ ను ఏర్పాటు చెయ్యడం దేశంలోనే ఇది మొదటి సారి.

రైతులకు ఎన్నో సమస్యలు..

దుక్కి దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కునే సమస్యలు ఎన్నో. రైతుల మేలుకోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. చట్టాలు తెలిసి ఉండి, వాటిని వినియోగించుకోగలిగితేనే ఏరువాక సాఫీగా సాగేది. భూమి సమస్యలు ఉత్పన్నమైనపుడు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, మార్కెట్ మోసాలు జరిగినప్పుడు, పంటల బీమా అందనప్పుడు ఇలా పలు సందర్భాలలో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంది.

పరిష్కార మార్గ సలహాలు

సమస్యల పరిష్కారానికి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు, కోర్టులకు వెళ్లాల్సి వచ్చినపుడు న్యాయ సేవలను పొందడం అవసరం. కానీ చట్టాలపై అవగాహన లేక, న్యాయ సహాయం అందక రైతులు వారికి మేలు చేసే చట్టలున్నా లబ్ది పొందలేక పోతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తగు న్యాయ సేవలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈనేపథ్యంలో, మొదటి ప్రయత్నంగా బమ్మెర గ్రామంలో “అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్” ప్రారంభం అయ్యిందని తెలిపారు.

కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, శ్రీ జస్టిస్ పి.వి.సంజయ కుమార్, తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్, తెలంగాణ హైకోర్టు న్యాయ మూర్తులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణ దేవ రావు, జనగామ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవల అథారిటీ చైర్మన్ బాల భాస్కర్, లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్, జిల్లా న్యాయ సేవల అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు, జూనియర్ ప్రిత్వి రాజ్, నల్సార్ రిజిస్ట్రార్ విద్యులతా రెడ్డి, లీఫ్స్ సంస్థ సలహాదారు కరుణాకర్ దేశాయి , గ్రామ సర్పంచ్ నాగభూషణం, లీఫ్స్, నల్సార్, న్యాయ సేవల అథారిటీ లా బృందం, గ్రామస్థులు పాల్గొన్నారు.

Latest News