Rail One App| రైల్వే శాఖ సేవలూ అన్ని ఒకే చోట లభించేలా రైల్ వన్ పేరిట దేశ ప్రజలకు కొత్తయాప్ అందుబాటులోకి తెచ్చింది. తొలుత స్వరైల్ పేరిట ఈ సూపర్ యాప్‌ను పరీక్షించిన రైల్వే శాఖ.. తాజాగా రైల్‌వన్(Railone) పేరుతో యాప్ ను పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది. రైల్ వన్ యాప్ తో రిజర్వ్‌డ్/ అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్‌ఆర్, జర్నీ ప్లానింగ్, రైల్ మదత్, ఫుడ్ ఆన్ ట్రైన్ వంటి అన్ని సేవలు పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు. ఇప్పటికే ఉన్న సూపర్ యాప్‌లో రైల్వే సేవలన్నీ ఆన్‌లైన్‌లో, యాప్ రూపంలో వేర్వేరుగా అందుబాటులో ఉన్నాయి. అదిగాక ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉంది. వీటన్నింటినీ ఇప్పుడు రైల్ వన్ యాప్‌లో వినియోగదారులు పొందవచ్చు. మున్ముందు మరిన్ని సేవలను రైల్ వన్ యాప్ లో జోడించే అవకాశం ఉంది.
రైల్ వన్ యాప్ వినియోగం తెలుసుకోండి
ముందుగా రైల్ వన్(Railone) యాప్ ను ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ వినియోగానికి అవసరమైన లొకేషన్ పర్మిషన్ ఇచ్చి యాప్ ఓపెన్ చేయాలి. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక మొదటి స్క్రీన్ మీద లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లోకి వెళితే రైల్ కనెక్ట్, యూటీఎస్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ సర్వీసుల్లో ఇప్పటికే ఖాతాలు ఉంటే ఆ లాగిన్ వివరాలతో యూజర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. రైల్ కనెక్ట, యూటీఎస్ ఖాతా లేకపోతే దానిపైన ఉండే బాక్స్‌లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌లో పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా సరి చేసి సైనప్ అవ్వాలి. ఓటీపీ, ఎంపీఐఎన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ లాగిన్ భద్రతను కూడా ఆన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబరుతో రైల్ కనెక్టు, యూటీఎస్ లో మీకు ఖాతా ఉందనే విషయం మరిచిపోతే యూజర్ క్రియేషన్ సమయంలో యాప్ గుర్తు చేస్తుంది. అక్కడ ఓకే చేస్తే క్రియేట్ ప్రాసెస్ మొదలవుతుంది. ఒకవేళ గెస్ట్‌గా లాగిన్ అయితే రైలు సమాచారం, పీఎన్‌ఆర్ స్టేటస్, ట్రాకింగ్, ప్లాట్‌ఫామ్ సమాచారం లాంటివి మాత్రమే చూడగలుగుతారు.