Actress Zareen Khan | బాలీవుడ్ బ్యూటీ జరీన్‌ఖాన్‌కు కోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి చీటింగ్ కేసులో కోల్‌కతా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోల్‌కతాలోని దుర్గాపూజకు సంబంధించిన ఈవెంట్‌కు జరీన్‌ఖాన్ హాజరుకావాల్సింది. ఇందుకోసం రూ.12లక్షలను నిర్వాహకులు అందజేశారు. అయితే, పలు కారణాలతో బాలీవుడ్ నటి హాజరుకాలేకపోయింది.
దీంతో నిర్వాహకులపై నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటితో పాటు ఆమె మేనేజర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. నటి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ఆ తర్వాత కోర్టు నటిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నటి కోర్టు ఆదేశాల మేరకు హాజరైంది.
దీంతో కోర్టుకు హాజరైంది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆధార్‌కార్డు వివరాలను అందించారు. ఈవెంట్‌కు, విచారణకు హాజరుకాకపోవడానికి నటి ఇచ్చిన సమాధానాలు సహేతుకంగా లేకపోవడంతో కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కేసు వాయిదాపడుతూ వచ్చింది. ఆ తర్వాత నటి బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా సిల్దా కోర్టు జరీన్‌ఖాన్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది.
నార్కెల్‌దంగా ఠాణాలో నమోదైన ఈ చీటింగ్ కేసులో రూ.30వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొదని ఆదేశించింది. విచారణ సమయంలో తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.