Site icon vidhaatha

COVID | వ్యాక్సిన్‌.. వేసుకున్న వాళ్లలోనే మరణాలు ఎక్కువ

COVID |

విధాత: వ్యాక్సిన్‌ వేసుకోవడానికి నిరాకరించిన వారి కంటే వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లలోనే 26 శాతం ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సీనియర్‌ బీమా విశ్లేషకుడు, అమెరికా బీమా విశ్లేషకుడు, పరిశోధకుడు జోష్‌ స్టర్లింగ్‌ వెల్లడించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న యాభైయేళ్ల లోపు వయస్సు వారిలో ఈ మరణాల శాతం ఇంకా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వ డేటాను విశ్లేషించినపుడు ఈ సంచలనకర విషయాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. ఈ సమాచారాన్ని సెనేటర్‌ రాన్‌ జాన్సన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు.

ఒకే ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో మరణాల సంఖ్య ఇంకా దారుణంగా ఉందని ఆయన చెప్పారు. యూకె డేటా విశ్లేషణను అమెరికాకు అన్వయిస్తే ఏటా సుమారు ఆరు లక్షల మంది ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ అనంతర మరణాలపై జరుగుతున్న విచారణ కమిషన్‌ ముందు జోష్‌ స్టర్లింగ్‌ తన వాదనలు వినిపించినట్టు ఫ్లోరిడా స్టాండర్డ్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

Exit mobile version