Site icon vidhaatha

Raja Singh: గోవధ నిషేధ చట్టం తేవాలి : రాజాసింగ్

Raja Singh: గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి, ముఖ్యమంత్రులకు తాకుతుందన్నారు. తరతరాలుగా వారిని ఆ పాపం వెన్నాడుతుందన్నారు. గతంలో గోవధ నిషేధానికి ప్రైవేట్ బిల్లుకు ఎంపీలు మద్దతునివ్వలేదని విమర్శించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ సహా దేశంలో వ్యవసాయానికి, పాడి పోషణకు పనికివచ్చే ఆవులు, ఎద్దులను కూడా వధిస్తున్నారని..వీధుల్లోని చెత్త కుప్పల్లో వాటి వ్యర్థాలే కనిపిస్తుంటాయని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఐదురోజులుగా అరెస్టు చేశారని..కాని వీధుల్లో పోలీస్ రక్షణలో బక్రీద్ సందర్భంగా ఆవులను, ఎద్దులను, వాటి పిల్లలను అమ్ముతున్నారని, వధిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు నోరుమూసుకుని ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఆవులను హతమార్చే వారితో పాటు వాటిని నివారించలేని ప్రజాప్రతినిధులకు కూడా ఆ పాపం తగులుతుందన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే గోమాతను జాతీయ పశువుగా ప్రకటించాలని..గో వధ నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని..బిల్లుకు దేశంలోని ప్రతి ఎంపీ మద్ధతనివ్వాలని కోరారు.

Exit mobile version