Chicken Fry | చికెన్ వేపుడు.. ఇలా ట్రై చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..

Chicken Fry | ఆదివారం వ‌చ్చిందంటే చాలు ఆహార ప్రియులు ర‌క‌ర‌క‌లా వెరైటీల గురించి ఆలోచిస్తుంటారు. శాఖాహారులైతే.. గుత్తి వంకాయ‌, ముద్ద ప‌ప్పు, పాల‌క్ ప‌న్నీరు వంటి కూర‌లు వండుకునేందుకు ట్రై చేస్తుంటారు. అదే మాంసాహారులైతే.. మ‌ట‌న్, చికెన్, చేప‌లు, రొయ్య‌లను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. రెగ్యుల‌ర్‌గా కాకుండా కొంత వెరైటీగా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. నాన్ వెజ్ ప్రియులు ర‌క‌ర‌కాల వంట‌లు వండేందుకు ట్రై చేస్తుంటారు.. అయితే చికెన్ వంట‌కాల్లో రుచిక‌ర‌మైన‌ది చికెన్ వేపుడు. ఈ వేపుడు చాలా […]

  • Publish Date - May 21, 2023 / 02:42 AM IST

Chicken Fry |

ఆదివారం వ‌చ్చిందంటే చాలు ఆహార ప్రియులు ర‌క‌ర‌క‌లా వెరైటీల గురించి ఆలోచిస్తుంటారు. శాఖాహారులైతే.. గుత్తి వంకాయ‌, ముద్ద ప‌ప్పు, పాల‌క్ ప‌న్నీరు వంటి కూర‌లు వండుకునేందుకు ట్రై చేస్తుంటారు.

అదే మాంసాహారులైతే.. మ‌ట‌న్, చికెన్, చేప‌లు, రొయ్య‌లను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. రెగ్యుల‌ర్‌గా కాకుండా కొంత వెరైటీగా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. నాన్ వెజ్ ప్రియులు ర‌క‌ర‌కాల వంట‌లు వండేందుకు ట్రై చేస్తుంటారు..

అయితే చికెన్ వంట‌కాల్లో రుచిక‌ర‌మైన‌ది చికెన్ వేపుడు. ఈ వేపుడు చాలా రుచిక‌రంగా ఉంటుంది. అంతే కాదు.. అన్నం, రొట్టె అవ‌స‌రం లేకుండా నేరుగా లాగించేయొచ్చు. అలాంటి చికెన్ వేపుడు గురించి తెలుసుకుందాం..

చికెన్ వేపుడుకు కావాల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో
బ‌ట‌ర్ – మూడు టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్స్
కారం – ఒక టీ స్పూన్
ప‌సుపు – అర టీ స్పూన్
ఉప్పు – త‌గినంత‌
ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్
మిరియాలు – ఒక టీ స్పూన్
జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
గ‌రం మసాలా – ఒక టీ స్పూన్
చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి -2
చిన్నగా త‌రిగిన పెద్ద ట‌మాటా -1
క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్

త‌యారీ విధానం ఇలా..

ఓ పాత్ర‌లో చికెన్ వేసి శుభ్ర‌మైన నీటితో క‌డ‌గాలి. మిక్సిలో ధ‌నియాలు, మిరియాలు, జీల‌క‌ర్ర వేసి పొడి చేసుకోవాలి. ఇక ఆ పొడిని చికెన్‌లో మిక్స్ చేసి బాగా క‌ల‌పాలి. మిగ‌తా ప‌దార్థాలు కూడా వేసి చికెన్ క‌లిపి.. ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత బౌల్‌లో బ‌టర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడి కాగానే.. మ్యారినేట్ చేసిన చికెన్‌ను అందులో వేసి.. ప‌ది నిమిషాల పాటు వేయించాలి.

త‌ర్వాత ట‌మాటా ముక్క‌లు, ప‌చ్చి మిర్చి వేసి క‌ల‌పాలి. ఇక బౌల్‌పై మూత పెట్టి.. మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్‌ను వేయించాలి. ఒక వేళ చికెన్ పొడిగా అనిపిస్తే కొంచెం నీటిని చ‌ల్లుకోవాలి. 15 నిమిషాల పాటు చికెన్‌ను వేయించాక‌.. క‌సూరిమెంతిని వేసి క‌ల‌పాలి.

ఒక‌ట్రెండు నిమిషాల పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో చికెన్ వేపుడు త‌యారైపోతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా చేసిన చికెన్ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Latest News