వైన్స్ TO బెల్ట్ షాప్స్: కోటి విలువైన నకిలీ మద్యం పట్టివేత

విధాత, చౌటుప్పల్: దేవులమ్మ నాగరంలలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కోటి విలువ చేసే నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. మునుగోడు ఎలక్షన్ లో ఇదే మద్యం సరఫరా చేసినట్లుగా అనుమానిస్తున్నారు. బింగి బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డిలకు చెందిన వైన్స్ ల నుండి ఆయా ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా అవుతుందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 20 పైగా వైన్ షాపులు వారిద్దరికీ ఉన్నాయని వాటిలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లుగా […]

  • Publish Date - December 17, 2022 / 02:37 AM IST

విధాత, చౌటుప్పల్: దేవులమ్మ నాగరంలలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కోటి విలువ చేసే నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. మునుగోడు ఎలక్షన్ లో ఇదే మద్యం సరఫరా చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

బింగి బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డిలకు చెందిన వైన్స్ ల నుండి ఆయా ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా అవుతుందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 20 పైగా వైన్ షాపులు వారిద్దరికీ ఉన్నాయని వాటిలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారుల దాడుల్లో గుర్తించారు.

ఇతర రాష్ట్రాల నుండి నకిలీ మద్యాన్ని తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఎక్సైజ్ పోలీసులు బాలరాజును అదుపులోకి తీసుకోగా, కొండల్రెడ్డి పరారిలో ఉన్నట్లు తెలిపారు.