Site icon vidhaatha

KTR: CRPF ఉద్యోగ పరీక్షలు.. ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి

విధాత‌: సీఆర్‌పీఎఫ్‌(CRPF) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కోరుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మంత్రి కేటీఆర్‌(KTR) ట్వీట్‌ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పరీక్షలు ఉండాలి. సీఆర్‌పీఎఫ్‌ పరీక్షలను ఇంగ్లిష్‌, హిందీలోనే నిర్వహిస్తున్నారు.

హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు ఇబ్బందికరం. 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ నియామక సంస్థ చెప్పింది. సీఆర్‌పీఎఫ్‌ నియామక నోటిఫికేషన్‌లో అమలు చేయడం లేదని కేటీఆర్‌ ట్విట్ట‌ర్‌ ద్వారా అమిత్‌ షా దృష్టికి తీసుకొచ్చారు.

Exit mobile version