Jharkhand Encounter| జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్..10మంది మావోయిస్టులు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సింగ్భూం జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో 10మంది మావోయిస్టులు మృతి చెందారు.

విధాత : జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సింగ్భూం జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో 10మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర భద్రతబలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. భద్రతా బలగాలకు నక్సల్స్ కి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెప్టెంబర్ నెలలో జార్ఖండ్‌లోని హజారీబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ లో బొకారో జిల్లాలోని జోగేశ్వర్ విహార్ పోలీస్​స్టేషన్ పరిధి పరస్పాడ్ అడవుల్లోని కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్​ మాంఝీ అలియాస్ వివేక్, అరవింద్ యాదవ్, సాహెబ్​రామ్ మాంఝీ సహా 8మంది చనిపోయారు. అనంతరం తాజాగా జరిగిన సింగ్బూం జిల్లా ఎన్ కౌంటర్ లోనే మావోయిస్టు పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లింది.

Latest News