మేషరాశి: శుభ వార్తలను వింటారు. క్రీడాకారులకు విజయం లభిస్తుంది. శతృవులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధన లాభములు కలుగుతాయి.
వృషభ రాశి: ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులు కొత్త విషయలు తెలుసుకుంటారు. అలంకార వస్తువులను సంగ్రహిస్తారు. ధన వ్యయము, ఆదాయము సమంగా వుంటాయి. దుర్వార్తా శ్రవణము బాధిస్తుంది.
మిథున రాశి: అధికారులతో విభేదాలు ఏర్పడుతాయి. శ్రమ ఎక్కువగా వుంటుంది. రాజకీయ నాయకులకు అపవాదులు కలిగే అవకాశముంది. ప్రయత్న కార్యములు సత్ఫలితాలివ్వక పోవడం వలన అశాంతి కలుగుతుంది.
కర్కాటక రాశి: దూర ప్రాంతముల నుండి శుభ సమాచారం వస్తుంది. పెద్దలతో కలయికలు లాభిస్తాయి. బంధుమిత్రుల సమాగమము ఆనందాన్నిస్తుంది. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది.
సింహ రాశి: శతృ బాధలు అశాంతి కలిగిస్తాయి. క్రీడాకారులకు శ్రమ ఎక్కువౌతుంది. వైద్య రంగంలోని వారికి అపనిందలు కలుగవచ్చును. ప్రయత్న కార్యములకు విఘ్నాలు కలుగుతాయి. భయమూలకంగా అశాంతి కలుగుతుంది.
కన్యా రాశి: కవులు, రచయితలకు సన్మానాది గౌరవములు లభిస్తాయి. మీ అంచనాలు నిజమౌతాయి, ఆటంకాలను అధిగమించి ప్రయత్న కార్యములను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పరోపకారముల వలన గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తులా రాశి: కుటుంబ మూలక అశాంతి కలుగవచ్చును. చెప్పుడ మాటలను వినడం వలన నష్టపోతారు. ప్రయాణ మూలక అశాంతి కలుగుతుంది. ధనవ్యయము ఎక్కువగా వుంటుంది. నిరుత్సాహం కలుగుతుంది.
వృశ్చిక రాశి: అసాధ్యమనుకున్న పనులు అనుకోకుండా పూర్తవుతాయి. సన్నిహితులు ఇంటికి వెళ్ళడం ఆనందాన్నిస్తుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్థి ప్రయత్నాలు సిద్ధిస్తాయి.
ధనుస్సు రాశి: క్రీడాకారులు రాణిస్తారు. వివాదాలలో విజయం లభిస్తుంది. నిద్రా సౌఖ్యముంటుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. నష్ట ధనప్రాప్తి కలుగుతుంది. శరీర సౌఖ్యము వుంటుంది.
మకర రాశి: పితృ వర్గము వారితో విభేదాలు ఏర్పడుతాయి. అధికారుల మూలక అశాంతి కలుగుతుంది. చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం మంచిది.
కుంభ రాశి: మనస్సు వికలమయ్యే అవకాశమున్నది. దుర్వార్తా శ్రవణము కలుగవచ్చును. తల్లి దండ్రుల ఆరోగ్యం అశాంతి కలిగిస్తుంది. ఇష్టములేని పనులను చేయవలసి వస్తుంది. ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం మంచిది.
మీన రాశి: ఋణ బాధలు తీరుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్థుల పెట్టుబడులు సత్ఫలితాలనిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.