విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర అనుబంధ దేవాలయం బద్ది పోచమ్మకు బోనం సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
అమ్మవారికి ఒడిబియ్యం బెల్లంసాక, కల్లుసాక, బోనం సమర్పించుకున్నారు. కోళ్ళు, గొర్రె పిల్లలను బోనంతో తీసుకువచ్చి జడ్తి ఇచ్చిన అనంతరం అమ్మవారికి సమర్పించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.