విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత దక్కిన నేపధ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ యాదవ్, లా అండ్ ఆర్డర్ డిజి ఆదివారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణుల , అభిమానుల కోలాహలం జోరందుకుంది.
పోలీస్ శాఖ రేవంత్ నివాసం వద్ధ అదనపు బందోబస్తు ఏర్పాటు చేసింది. పలువురు ప్రముఖులు, పార్టీ ముఖ్యులు పెద్ద సంఖ్యలో రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. రేవంత్ అభిమానులు టిడిపి కాంగ్రెస్ జెండాలతో వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.