DhruvVikram
విధాత: తమిళ నటులు విక్రమ్, సూర్య, శివ కార్తికేయన్, విజయ్, అజిత్‌లకు తెలుగు నాట ఎలాంటి ఫ్యాన్ భేస్ ఉందో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి బాటలో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.
అయితే అది కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమాతో రానుండడం విశేషం. కేవలం నటనే కాకుండా సింగర్‌గా కూడా పేరున్న దృవ్ ఇప్పటికే తెలుగులో నాని హాయ్ నాన్న సినిమాలో ‘ఓడియమ్మ’ పాటను పాడి ఇక్కడి ప్రేక్షకులను అలరించాడు.
ఇదిలాఉండగా మంగళవారం, ఆరెక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో దృవ్ (Dhruv Vikram) తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు బాగా వచ్చినప్పటికీ అదీ కాకుండా ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం.
గతంలో 120కి పైగా అవార్డులు దక్కించుకుని వరల్డ్ గిన్నిస్ రికార్డు సృష్టించిన మనసా నమః షార్ట్ ఫిలిం డైరెక్టర్ దీపక్ రెడ్డి దర్శకత్వంలో ధృవ్ (Dhruv Vikram) నటించనున్నట్లు సమాచారం. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుండగా ఈ సినిమాపై అధికారిక ప్రటన రావాల్సి ఉంది.