Kamal hasan: విధాత: ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజల మనోభావాలను ఎందుక దెబ్బ తీశారంటూ ప్రశ్నించింది. ఇటీవల కమల్ హాసన్ ఓ సినిమా పంక్షన్ లో మాట్లాడుతూ.. కన్నడ భాష .. తమిళ భాష నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్లు తీవ్ర వివాదంగా మారాయి. కన్నడ ప్రజలు, భాషావేత్తలు, భాషాభిమానులు కమల్ హాసన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సినిమాను తమిళనాడులో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. కమల్ హాసన్ వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
కానీ కమల్ హాసన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. కోర్టును ఆశ్రయించారు. తన చిత్రాన్ని విడుదల చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కాగా కమల్ హాసన్ పిటిషన్ పై జస్టిస్ ఎం నాగప్రసన్న స్పందిస్తూ .. మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. భాష అనేది ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. భావోద్వేగం, అనుబంధం ఉంటాయి.
అటువంటి భాష విషయంలో మాట తప్పుతారా?’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఒక నటుడిగా మీకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుంది. మీరు ఎంతో ప్రభావితం చేయగలుతారు. అటువంటిది మీరెలా తప్పుగా మాట్లాడతారు.. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషానిపుణులా అంటూ ప్రశ్నించింది. ప్రజలు కేవలం క్షమాపణలే కోరుకుంటున్నారు కదా.. అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.