Site icon vidhaatha

రెండు రోజుల సమయం కావాలి.. రాడిసన్ డ్రగ్ కేసులో డైరక్టర్ క్రిష్ అభ్యర్థన

విధాత, హైదరాబాద్‌ : రాడిసన్ హోటల్‌ డ్రగ్ కేసు విచారణకు తాను ముంబైలో ఉన్నందునా నేడు బుధవారం హాజరుకాలేకపోతున్నానని, రెండు రోజుల సమయం కావాలని సినీ డైరక్టర్ క్రిష్ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని క్రిష్ తెలిపారు.


మరోవైపు డ్రగ్ పార్టీలో ఉన్న నటి లిషి, శ్వేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేశారు. రాడిసన్ డ్రగ్ కేసులో టాలివుడ్ సినీ డైరక్టర్ క్రిష్ సహా, పలువురు నటులు, యూట్యూబర్లు ఉండటంతో మరోసారి టాలివుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్ కేసుల కలకలం చోటుచేసుకుంది.

Exit mobile version