భారత-చైనా సరిహద్దు వివాదం.. సైనిక కమాండర్ల చర్చలు

స్థిరమైన భద్రత కొనసాగేలా చూడాలని నిర్ణయించిన ఆర్మీ అధికారులు విధాత: సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితుల్లోనే భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనిక అధికారుల 17వ దఫా చర్చల్లో భారత్‌-చైనా కోర్‌ కమాండర్లు పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చుశుల్‌-మోల్డ్‌ సరిహద్దు ప్రాంతంలోని చైనా భూ భాగంలో ఈ చర్చలు కొనసాగాయి. దీనిలో తూర్పు లద్దాఖ్‌లో అపరిష్కృతంగా ఉన్న వివాదాస్పద అంశాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో ఇరు దేశాల […]

  • Publish Date - December 23, 2022 / 11:25 AM IST
  • స్థిరమైన భద్రత కొనసాగేలా చూడాలని నిర్ణయించిన ఆర్మీ అధికారులు

విధాత: సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితుల్లోనే భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనిక అధికారుల 17వ దఫా చర్చల్లో భారత్‌-చైనా కోర్‌ కమాండర్లు పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చుశుల్‌-మోల్డ్‌ సరిహద్దు ప్రాంతంలోని చైనా భూ భాగంలో ఈ చర్చలు కొనసాగాయి. దీనిలో తూర్పు లద్దాఖ్‌లో అపరిష్కృతంగా ఉన్న వివాదాస్పద అంశాల గురించి చర్చించారు.

ఈ చర్చల్లో ఇరు దేశాల ఉన్నత స్థాయి ఆర్మీ అధికారులు నిర్దిష్టమైన నిర్ణయాలేమీ తీసుకోలేదు. కానీ… సరిహద్దులో స్థిరమైన భద్రతను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా వివాదాలకు మూలమైన వాటిని గుర్తించి పరిష్కరించకుండా ప్రయోజనం ఉండదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

సరిహదు సమస్యలను చిన్న వివాదాలుగా చూస్తున్నా.. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం మరువరాదు. తాజా తవాంగ్‌ ఘర్షణలోనూ పదుల సంఖ్యలో జవాన్లు గాయాల పాలయ్యారు. ఈ విధంగా గత కొన్నేండ్లుగా చైనాతో సరిహద్దు వివాదాలు, ఘర్షణలు ఎందుకు తలెత్తుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల సైనికులు తమ పరిధి, పరిమితులకు లోబడి ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు చర్చలు జరుపటం పరిపాటి. వారి పరిధిలో తాత్కాలిక ఉపశమనంగా ఉద్రిక్తతలు పెరుగకుండా, ఘర్షణలు కొనసాగకుండా చూస్తున్నారు. కానీ ఇలాంటి సరిహద్దు సమస్యల విషయంలో రాజకీయ పరిష్కారమే అంతిమ పరిష్కారమన్నది మరువరాదు. ఇరు దేశాల అధినేతలు అసలు మూలాలకు పోయి సరిహద్దు సమస్యలకు చరమగీతం పాడాలి. తద్వారా మాత్రమే ఉద్రిక్తతలు తగ్గుతాయి.