Site icon vidhaatha

Tehsildars | 169 మందికి.. తహసీల్దార్లుగా పదోన్నతులు 

Tehsildars
విధాత: 169 మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతుల డీపీసీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్‌ ఏ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ అధ్యక్షతన సమావేశమైన డిపార్ట్‌మెంటల్‌ ప్ర మోషన్‌ కమిటీ (డీపీసీ) 169 మందికి తాసీల్దార్లుగా పదోన్నతులు కల్పించింది.
డీపీసీ ఆమోదం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగానే వీరందరికి తాసీల్దార్లుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్‌లు ఇస్తారు. 2016-17 పానల్ ఇయర్ కు సంబందించిన డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు రావడం పట్ల రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ ల నేతృత్వంలోని ట్రెసా రాష్ట్ర బృందం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గత నెలలో 100 డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో రెవెన్యూ శాఖలో క్రింద నుండి పైకి అన్ని స్థాయిల్లో పదోన్నతుల ఛానల్ కదిలిందని,ఈ రోజు 169 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించారన్నారు.
తర్వాత 200 పైగా సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లకు పదోన్నతులు కల్పించబడతాయని ట్రెసా తెల్పింది. రెవెన్యూలో ప్రమోషన్లకు ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా నాయకులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్, రమేష్ పాక, కార్యదర్శి చిల్లా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు నజీమ్ ఖాన్, శ్రావణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె. రామకృష్ణ, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version