విధాత: ఓ ట్రక్కు డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో ట్రక్కును రైలు పట్టాలపైకి పోనిచ్చాడు. అది పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో ముందుకు కదల్లేకపోయింది. దీంతో డ్రైవర్ దిగి పరారీ అయ్యాడు. లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Late night in #Ludhiana, a drunk truck driver drove the truck on the railway track for about 1 KM and later fled from the spot, leaving the truck behind. Taking cognizance of the matter, Railway Police removed the truck from the track and cleared the entire railway track. pic.twitter.com/HCLYKi6OiT
— Nikhil Choudhary (@NikhilCh_) November 25, 2023
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 24వ తేదీన ఓ ట్రక్కు డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించాడు. లుధియానా రైల్వే స్టేషన్ సమీపంలో ట్రక్కును రైలు పట్టాలపైకి పోనిచ్చాడు. ఆ వాహనం కొంతదూరం వెళ్లాక, పట్టాలపై ఆగిపోయింది. ముందుకు కదలకపోవడంతో డ్రైవర్ ట్రక్కు దిగి పరారీ అయ్యాడు. అదే సమయంలో గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ ఆ పట్టాలపైకి దూసుకొచ్చింది. అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వేశాడు. దీంతో రైలు ట్రక్కుకు టచ్ అయి ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. ప్రాణ నష్టం జరగలేదు. దీంతో రైల్వే అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో ట్రక్కును పట్టాలపై నుంచి తొలగించారు. అనంతరం గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసలు గాలిస్తున్నారు