Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యపరిచేలా ఉండడంతో.. మరికొన్ని ఆసక్తి కలిగిస్తుంటాయి. మరికొన్ని నవ్వుల పువ్వులు పూయిస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఇంకా వైరల్ అవుతుంటాయి. తాజాగా పామును బాతు అమాంతం మింగేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. ఓ చిన్న బాతు పిల్ల కాలువ ఒడ్డున పచ్చ గడ్డిలో పురుగులు, కీటకాల కోసం వెతుకుతుంది. అప్పుడే ఆ బాతుకు ఓ ప్రమాదకరమై పాము కనిపించింది. వెంటనే పామును బాతు నోటితో ఒడిసిపట్టి.. కొద్ది కొద్దిగా చూస్తుండగానే అమాంతం మింగేసింది. పాము బాతుబారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఈ వీడియో ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్నది.
Viral Video | పామును ఆమాంతం మింగేసిన బాతు..! https://t.co/HqJg5tgPmp pic.twitter.com/j8htG2RshH
— vidhaathanews (@vidhaathanews) December 22, 2022