విధాత: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరను వైభవంగా నిర్వహించాలని మంత్రి జి జగదీష్ రెడ్డి సూచించారు. సోమవారం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తో కలిసి హాజరయ్యారు.
బడుగుల ఎంపీ కోటా రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. జాతరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరాలు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగము, పాలకమండలి సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం ఆయన జాతర తేదీలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు అలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్ తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర షెడ్యూల్
లింగమతుల స్వామి పెద్దగట్టు జాతర నిర్వహణలో భాగంగా జనవరి జనవరి 22న ఆదివారం రాత్రి 11 గంటలకు దిష్టిపూజ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది.