పీఎం కిసాన్ కు ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రి: అద‌న‌పు క‌లెక్ట‌ర్‌

జిల్లాలో లబ్ధిదారులు.1,36,109 మంది ఇప్ప‌టి వ‌రకు 71శాతం పూర్త‌యిన ఈ-కేవైసీ విధాత, మెదక్ బ్యూరో: పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. గురువారం తన చాంబర్ లో వ్యవసాయధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,36,109 రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ఇందులో ఇప్పటివరకు 97,091 మంది రైతులు మాత్ర‌మే ఈ-కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 39, 018 మంది రైతులు ఈ-కేవైసీని చేయించుకోవాల్సి ఉందని […]

  • Publish Date - December 15, 2022 / 08:56 AM IST
  • జిల్లాలో లబ్ధిదారులు.1,36,109 మంది
  • ఇప్ప‌టి వ‌రకు 71శాతం పూర్త‌యిన ఈ-కేవైసీ

విధాత, మెదక్ బ్యూరో: పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. గురువారం తన చాంబర్ లో వ్యవసాయధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,36,109 రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించామన్నారు.

ఇందులో ఇప్పటివరకు 97,091 మంది రైతులు మాత్ర‌మే ఈ-కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 39, 018 మంది రైతులు ఈ-కేవైసీని చేయించుకోవాల్సి ఉందని అన్నారు. 13వ విడత పీఎం కిసాన్ నిధులు తమ బ్యాంకు ఖాతాలలో జమ కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని రమేష్ రైతులకు సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ లలో గాని సంప్రదించి పీఎం కిసాన్ కు తమ ఆధార్ నెంబర్ ను, ఫోన్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రైతులకు సూచించారు. కాగా జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియ 71 శాతం పూర్తయిందని అన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఈ-కేవైసీ ప్రక్రియ విధానంపై అవగాహన కల్పించి వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఆశాకుమారి, సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ, వ్యవసాయ అధికారి హర్ష, డి.ఎస్.ఓ. శ్రీనివాస్ పాల్గొన్నారు.