EAMCET
విధాత: తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 10వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు హాల్‌టికెట్లు విడుదల చేశారు.
https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు జరగనుండగా.. 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10నే గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోని వారికి ఇంకా అవకాశం ఉన్నది. మే 2 వ తేదీ వరకు ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.